బడ్జెట్‌లో కార్మిక వర్గంపై చిన్నచూపు | - | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో కార్మిక వర్గంపై చిన్నచూపు

Mar 21 2026 5:14 AM | Updated on Mar 21 2026 5:14 AM

హన్మకొండ : రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కార్మిక వర్గంపై చిన్నచూపు చూపింది. ఎన్నికల ముందు కార్మికవర్గానికి ఇచ్చిన హామీల అమలులో విఫలమైంది. ఇప్పటి వరకు మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మిక వర్గానికి ఆశించిన మేరకు నిధుల కేటాయించలేదు. అంగన్‌వాడీ వర్కర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు నెలకు రూ.18వేల వేతనం ఊసేలేదు. మధ్యాహ్న భోజన కార్మికులు, వీఓఏ, ఆర్‌సీలకు రూ.10 వేలు, మున్సిపల్‌ కార్మికులకు, కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు నెలకు రూ.24 వేల వేతన హామీ బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి సంక్షేమ బోర్డు, ఆటో కార్మికులకు రూ.10 వేల భృతి హామీ విస్మరించారు.

– నాయిని రవి,

బీఆర్‌టీయూ హనుమకొండ జిల్లా కన్వీనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement