భార్యపై భర్త హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

భార్యపై భర్త హత్యాయత్నం

Mar 20 2026 8:22 AM | Updated on Mar 20 2026 8:22 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : భార్యపై భర్త కత్తితో హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన గురువారం మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లిలో జరిగింది. రూరల్‌ ఎస్సై వి.దీపిక తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లి శివారులోని కొత్త గుంపులు ప్రాంతానికి చెందిన వీరబోయిన నరేశ్‌ 12 ఏళ్ల క్రితం తమ సమీప నివాసి విజయను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఆవరణలోని క్యాంటీన్‌లో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈక్రమంలో ఇటీవల దంపతుల మధ్య తగాదా జరగగా రెండు రోజుల క్రితం భార్య తన తల్లిగారింటికి వెళ్లింది. అక్కడ తమ బంధువుల ఇంటిఎదుట కూర్చొని ఉండగా నరేశ్‌ ఆగ్రహంతో వచ్చి కత్తితో హత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు 108లో జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజీఎం తరలించారు. ఈ ఘటనపై విజయ తల్లి తుర్క కళమ్మ ఫిర్యాదు మేరకు నరేశ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌ తరలించనున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి విజయ కొంతకాలంగా చాలా సమయం పాటు ఫోన్‌ మాట్లాడుతుండడంతో నరేశ్‌ అనుమానం పెంచుకున్నట్లు సమాచారం. దీంతో నరేశ్‌ తరచూ భార్యతో గొడవ పెట్టుకుంటున్నాడని, ఈ క్రమంలోనే ఆమైపె హత్యాయత్నం చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

కంబాలపల్లిలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement