కాజీపేట అర్బన్ : కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్‌గృహకల్ప సముదాయంలో బుధవారం తెల్ల వారుజామున మామ రాజశేఖర్, భార్య రాజశ్రీని భర్త ప్రవీణ్ హత్య చేసిన విషయం తెలిసింది. ఈ ఘటనతో అనాథలైన చిన్నారుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తెలిపారు. ఈమేరకు గురువారం కడిపికొండలోని రాజీవ్‌గృహకల్ప సముదాయంలోని ఘటనాస్థలిని కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డితో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మడికొండ పీఎస్ ఆవరణలో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు. ప్రభుత్వానికి చిన్నారుల వివరాలు తెలియజేసి వారి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మడికొండ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్, ఎస్సైలు రాజ్‌కుమార్, రామ్మోహన్, రాజబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత


