నరసింహమూర్తికి ఉగాది పురస్కారం | - | Sakshi
Sakshi News home page

నరసింహమూర్తికి ఉగాది పురస్కారం

Mar 20 2026 8:13 AM | Updated on Mar 20 2026 8:13 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన వేద పండితుడు తాటిపాముల నరసింహమూర్తి ఉగాది పురస్కారం అందుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది పంచాంగ అరవనం ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు నరసింహామూర్తికి ఉగాది పురస్కారం అందజేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

విజిలెన్స్‌ సభ్యుల

ఎంపికకు ఆహ్వానం

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాస్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటుకు జిల్లాలో ఐదుగురు సభ్యులను ఎంపిక చేస్తామని జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ కార్యనిర్వాక సంచాలకుడు శ్రీనివాస్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ, ఉన్నత చదువులు చదివిన వారికి మొదట ప్రాధాన్యత ఉంటుందని, కుల ధ్రువీకరణ పత్రం ఉండాలని తెలిపారు. ఎలాంటి పోలీసు కేసులు ఉండని వారు అర్హులని తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి కార్యాలయంలో వివరాలు అందజేయాలని తెలిపారు. ఇతర వివరాలకు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయం సంప్రదించాలని కోరారు.

రామప్పలో నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీ అధికారులు

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం న్యూఢిల్లీలోని నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీలో నేషనల్‌ సెక్యూరిటీ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌పై శిక్షణ ఇచ్చే అధికారులు సచిన్‌ బాద్‌షా, తరుణ్‌గుప్తా, ఇవాన్‌ అలెగ్జాండర్‌, అంజన వశిష్టలు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించగా రామ ప్ప శిల్పకళసంపద బాగుందని వారు కొని యాడారు. వారి వెంట కోఆర్డినేటర్‌ సందీప్‌, తహసీల్దార్‌ గిరిబాబు, ఎస్సై చల్ల రాజు, ఏఎస్సై సాంబారావు, ఆర్‌ఐ రమేశ్‌ పాల్గొన్నారు.

ఘనంగా వసంత

నవరాత్రోత్సవాలు షురూ

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి ఆలయంలో శ్రీపరాభవ నామ సంవత్సరం చైత్రమాసం పాడ్యమి తిథిని పురస్కరించుకుని గురువారం వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి నిర్మాల్య సేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వసంత నవరాత్ర ఉత్సవాలు జరపడానికి అనుజ్ఞాప్రార్థన జరిపి పూర్ణాభిషే కం నిర్వహించి అమ్మవారిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నీలి మా దంపతులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్న అనంతరం అమ్మవారి సన్నిధిలో జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఉగాది పర్వదినం కావడంతో భక్తులతో దేవాలయం కిక్కిరిసిపోయింది. లక్ష పుష్పార్చనలో భాగంగా ఉత్సవాల మొ దటిరోజు పసుపు రంగు చామంతులకు సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్‌ డాక్టర్‌ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు జ్యోతి ష్య పండితులు రాధాకృష్ణశర్మ సిద్ధాంతిచే పంచాంగ శ్రవణం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement