● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
● శ్రీరామ ఆలయంలో పంచాంగ పఠనం
మహబూబాబాద్ రూరల్ : శ్రీపరాభవనామ సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. నూతన తెలుగు సంవత్సరాది, శ్రీపరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో గురువారం పంచాంగ పఠనం ఏర్పాటు చేశారు. బ్రాహ్మణోత్తములు బ్రహ్మశ్రీ గుడి రాధాకృష్ణమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ఎమ్మెల్యే మురళీనాయ క్, డీసీసీ అధ్యక్షురాలు ఉమ, మున్సిపల్ చైర్ పర్స న్ జ్యోతిరమేష్ దంపతులు హాజరై శ్రీసీతారాముల సన్నిధిలో పంచాంగ పఠనాన్ని ప్రారంభించారు. ఆలయంలో పూజలు చేయగా ఆలయ ప్రధాన అర్చకులు ఎంవీ.కృష్ణప్రసాద్ ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ గుడి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ పరాభవ నామ సంవత్సరాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే పరా అంటే దివ్యశక్తి, ఆదిపరాశక్తి అని, భవ అంటే పరమశివుడు అని తెలిపారు. ఈ పరాభవ నామ సంవత్సరం పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మన జీవితాలను నడిపించే సంవత్సరం అని భావించవచ్చని సూచించా రు. పరాభవం అంటే ఓటమి కాదని, మనల్ని మనం తెలుసుకునే ఒక అవకాశమని వివరించారు. పడిపోవడం సహజంకానీ లేచినిలబడటం గొప్పతనమని, భయపడకుండా నమ్మకంతో ముందుకు సాగాలని, దైవానుగ్రహంతో విజయాన్ని సాధించాలన్నారు. కార్యక్రమంలో సహ అర్చకులు మారేపల్లి కౌశిక్ శర్మ, హరి శ్రీవాస్తవ, ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ఊరె గురునాధరావు, ఓంనారాయణ లోయ, రమేష్, అజయ్ సారథి రెడ్డి, అరుణ, పద్మం ధనలక్ష్మి, మాధవి, లావణ్య పాల్గొన్నారు.


