వైభవంగా సీతారాముల ఊరేగింపు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా సీతారాముల ఊరేగింపు

Mar 20 2026 8:13 AM | Updated on Mar 20 2026 8:13 AM

ప్రారంభమైన సీతారామ కల్యాణ

వసంత నవరాత్రి వేడుకలు

పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

మురళీనాయక్‌, డీసీసీ అధ్యక్షురాలు ఉమ

మహబూబాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో 68వ కల్యాణ వసంత నవరాత్రి వేడుకలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్‌, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్‌ భూక్య ఉమ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గుగులోత్‌ జ్యోతిరమేష్‌ దంపతులు పూజలు నిర్వహించి, రథంలాగి ఊరేగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళవాయిద్యాలతో సీతారామ, లక్ష్మణ, ఉత్సవమూర్తులను రథంలో కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆలయంలో విఘ్నేశ్వర పూజ, అఖండ కలశ విగ్రహ ప్రతిష్ట, మధ్యాహ్నిక భోగం, నీరాజనం, మంత్ర పుష్ప పూజలు చేశారు. కార్యక్రమంలో బ్రహ్మశ్రీ గుడి రాధాకృష్ణమూర్తి, ఆలయ ప్రధానార్చకులు ఎంవీ కృష్ణప్రసాద్‌, ప్రోగ్రాం కన్వీనర్‌ డాక్టర్‌ గురునాథరావు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మదన్‌ గోపాల్‌ లోయ, వాంకుడోత్‌ కొమ్మాలు, జ్ఞానేశ్వర్‌, యాకన్న, విజయ్‌, కార్తీక్‌, సోమశ్రీను, రవికుమార్‌, నరసింహారావు, శక్రు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement