● మూడు తులాల బంగారు ఆభరణాల స్వాధీనం
● వివరాలు వెల్లడించిన పోలీసులు
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తానేదార్‌పల్లిలో గత నెల 3వ తేదీన జరిగిన చోరీని పోలీ సులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడు మోడెం తలుపులయ్యను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి మూడు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రైనీ ఐపీఎస్, ఇన్‌చార్జ్ ఎస్‌హెచ్‌ఓ మనీషానెహ్రా వివరాలు వెల్లడించారు. తానేదార్‌పల్లికి చెందిన గడెం కొమురయ్య కోళ్ల ఫామ్‌లో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజవోమంగి మండలం వంచంగి గ్రామానికి చెందిన తలుపులయ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా, ఈ నెల 3న కోళ్ల ఫారం వద్ద ఉన్న కొమురయ్య గది నుంచి తలుపులయ్య మూడు తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితుడు పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సీఐ జి.వేణు ఆధ్వర్యంలో సిబ్బంది శివునిపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా తలుపులయ్య అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ట్రైనీ ఐపీఎస్ తెలిపారు.


