పెద్దవంగర: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, డైట్ మెనూ కచ్చితంగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం, బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కామన్ డైట్ మెనూ ప్రకారం బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ సమయానికి అందించాలని వార్డెన్‌కు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షించాలన్నారు. షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక చొరవ చూపాలన్నారు. హాస్టల్ పరిసరాలు, కిచెన్ షెడ్, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్ కుమార్, ఎంపీడీఓ వేణుమాధవ్, ఆర్‌ఐ లస్కర్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు ‘డబుల్’ ఇళ్లు అందించేందుకు కృషి
తొర్రూరు: అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేసేందుకు కృషి చేస్తామని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు. డివిజన్ కేంద్రంలోని అన్నారం రోడ్డు, గోపాలగిరి రోడ్డులోని డబుల్ బెడ్రూం ఇళ్లను బుధవారం పరిశీలించారు. నిర్మాణాలు పూర్తయిన చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని, వివిధ దశల్లో ఆగిన నిర్మాణాల పూర్తికి చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, తాగునీటి సౌకర్యం, డ్రెయినేజీలు, సీసీ రోడ్లు వంటి సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి అర్హులను గుర్తించాలని, ఇళ్ల కేటాయింపులో ఎలాంటి పైరవీలకు తావు లేదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, హౌజింగ్ అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో


