ముందస్తు గ్యాస్‌ బుకింగ్‌ చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ముందస్తు గ్యాస్‌ బుకింగ్‌ చేయొద్దు

Mar 19 2026 8:26 AM | Updated on Mar 19 2026 8:26 AM

అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌

మహబూబాబాద్‌: అనవసరంగా ముందస్తు గ్యాస్‌ బుకింగ్‌ చేయవద్దని అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని హెచ్‌పీగ్యాస్‌ గోదాం, మానుకోట మండలం మల్యాల గ్రామంలోని శ్రీధర్‌ ఇండెన్‌ గ్యాస్‌ ఏజెన్సీ గోదాంను బుధవారం అదనపు కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాంలలో ఉన్న నిల్వలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్‌ నిల్వలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. 25రోజుల తర్వాత మాత్రమే గృహ అవసరాల కోసం బుకింగ్‌ చేసుకోవాలన్నారు. డీసీఎస్‌ఓ రమేశ్‌, తహసీల్దార్‌ చంద్ర రాజేశ్వర్‌, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement