కేసముద్రం: మండలంలోని బిచ్యానాయక్‌తండాజీపీలో డీఎల్‌పీఓ స్వరూప సోమవారం విచారణ చేశారు. జీపీ కార్యదర్శి తప్పుడు లెక్కలు చూపుతున్నట్లు ఆరోపిస్తూ, ఆ గ్రామ సర్పంచ్ ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎల్‌పీఓ జీపీని సందర్శించి, విచారణ జరిపారు. ఈ నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు ఆమె తెలిపారు.
భూదాన్ భూములు కాపాడాలి
నెహ్రూసెంటర్: మహబూబాబాద్‌లోని భూదా న్ భూములను కాపాడి, భూమిలేని పేదలకు పంపిణీ చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ భీమానాయక్ సోమవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించి బడా కబ్జాదారుల భూములను మాత్రం అధికారులు వదిలేస్తున్నారని ఆరోపించారు. కబ్జాకు గురవుతున్న భూములను రెవెన్యూ అధికారులు వెలికితీయాలని తెలిపా రు. భూదాన్ భూములను కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకుని పేదలకు పంపిణీ చేయాలన్నారు.
రైల్వే అండర్‌బ్రిడ్జి రహదారి మూసివేత
గార్ల: గార్ల రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి రహదారిని రైల్వే మూడో లైన్ మరమ్మతుల దృష్ట్యా ఈనెల 18 నుంచి 28వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు సోమవారం రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. కాగా జీవంజిపల్లి, గండి, గండితండా గ్రామాల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. రహదారి మూతపడినందున ప్రజలు రైల్వేశాఖకు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.
ఆరోగ్య రక్షణలో టీకా ముఖ్య భూమిక
నెహ్రూసెంటర్: వ్యాధుల నివారణ, పిల్లలు, తల్లులను రక్షించడంలో టీకా ప్రధాన పాత్ర పోషిస్తుందని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ తెలి పారు. మాతృ, శిశు మరణాలను గణనీ యంగా తగ్గించడంలో వ్యాధి నిరోధక టీకాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. రోగ నిరోధక శక్తి సన్నగిల్లినప్పుడు, టీకా కార్యక్రమం క్రమం తప్పితే పాత వ్యాధులు తిరిగి వ్యాప్తి చెందుతాయన్నారు. టీకాలు ప్రాణాలను కాపాడటమే కాకుండా ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, అనారోగ్యంతో ముడిపడి ఉన్న ఆర్థిక నష్టాలను కూడా తగ్గిస్తాయని పేర్కొన్నారు. సకాలంలో, సరైన మోతాదులో అవసరమైన టీకాలు తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని మరింత బలోపేతం చేసుకోవచ్చని డీఎంహెచ్‌ఓ తెలిపారు.
పనిచేయని లిఫ్ట్.. పేషెంట్ల పాట్లు
నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నెలల తరబడి లిఫ్ట్ పని చేయకపోవడంతో పేషెంట్లు రెండు, మూడో అంతస్తులకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్య ంగా చివరి అంతస్తులో ఆర్థోవిభాగం ఏర్పాటు చేయగా.. కాళ్లు విరిగిన వారు సర్జరీ అయిన వారు మెట్ల ద్వారా కిందకు రావాల్సిన దుస్థితి నెలకొంది. కాగా మరమ్మతు పనులు చేపట్టి లిఫ్ట్‌ను వినియోగంలోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.


