నెహ్రూసెంటర్: ప్రధాని మోదీ వైఫల్యంతోనే దేశంలో గ్యాస్ ధరలు పెరిగాయని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయ్‌సారథి విమర్శించారు. గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో గ్యాస్‌బండలతో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయాలన్నారు. అంతర్జాతీయ చమురు క్షేత్రాలపై సంపూర్ణ ఆధిపత్యం కోసం పశ్చిమాసియాలో యుద్ధానికి దిగాయన్నారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయని, దేశ ప్రధాని అమెరికాకు దాసోహమయ్యారని, యుద్ధంపై మోదీ మౌనం వీడాలని అన్నారు. గ్యాస్ ధరలు పెరిగినా ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. గ్యాస్ ధరలు తగ్గించాలని, ప్రధాని తక్షణమే ఇరు దేశాల మధ్య శాంతిచర్చలు జరిపేలా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బి.అజయ్‌సారథిరెడ్డి, పట్టణ సహాయ కార్యదర్శులు నవీన్, వెంకన్న, నాయకులు మామిండ్ల సాంబలక్ష్మి, వెలుగు శ్రావణ్, నాగెల్లి యాకమ్మ, మంద శంకర్, తండ శ్రీనాథ్, బొమ్మెర రమ, ముంజంపల్లి శ్రీను కూరాకుల పాల్ తదితరులు పాల్గొన్నారు.


