మహబూబాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో నాలుగో నంబర్ ప్లాట్‌ఫాం నిర్మించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేశాఖ అధికారులు ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో అమృత్‌భారత్ పథకంలో భాగంగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరిస్తున్నారు. ఈమేరకు రైల్వే మూడో లైన్ పనులు చేపట్టారు. అయితే నాలుగో నంబర్ ప్లాట్‌ఫాం నిర్మించకపోవడంతో ప్రయాణికులు రైళ్లు ఎక్కేందుకు, దిగేందుకు, బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదకరంగా రైల్వే మూడో లైన్‌ను దాటి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
– మహబూబాబాద్ రూరల్
రైళ్లు దిగి మూడో ట్రాక్ దాటి వెళ్తున్న ప్రయాణికులు


