పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

Mar 17 2026 8:22 AM | Updated on Mar 17 2026 8:22 AM

మహబూబాబాద్‌: ప్రతీ కార్యాలయంలో పెండింగ్‌ ఫైళ్లు క్లియర్‌ చేయడంతో పాటు, కార్యాలయాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్‌ స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సమాధానం ఇస్తూ వేగంగా పరిష్కరించాలన్నారు. సీనియర్‌ సిటిజన్స్‌, భూ సంబంధిత, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వ్యవసాయం, ఇరిగేషన్‌, దివ్యాంగుల సమస్యలపై వచ్చిన దరఖాస్తుల విషయంలో తక్షణమే పరిష్కరించి నివేదిక అందజేయాలన్నారు. ప్రజావాణిలో 156 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో, జిల్లాస్థాయ అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

ప్రజావాణిలో 156 దరఖాస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement