తొర్రూరు: ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవా లని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్‌కుమార్ కోరారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని కోర్టు ఆవరణలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ధీరజ్‌కుమార్ మాట్లాడుతూ.. అనేక కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ అమూల్యమైన జీవి తాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిమినల్, భూతగాదలు, సివిల్, డ్రంకెన్ డ్రైవ్, ట్రాఫిక్ చలాన్లు వంటి కేసులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏపీపీ రేవతిదేవి, సీఐలు గణేష్, రాజ్‌కుమార్, ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.


