అమెరికాలో గుండెపోటుతో వరంగల్‌ వాసి మృతి | - | Sakshi
Sakshi News home page

అమెరికాలో గుండెపోటుతో వరంగల్‌ వాసి మృతి

Mar 17 2026 8:22 AM | Updated on Mar 17 2026 8:22 AM

రామన్నపేట : వరంగల్‌ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్‌(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్‌ 2007 సంవత్సరంలో ఎంఎస్‌ చదివేందుకు యూఎస్‌ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్‌ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు.

పరామర్శించిన ప్రముఖులు

మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్‌రావు, చాంబర్‌ ఆఫ్‌ కామ ర్స్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్‌ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు.

సంపులో పడి వృద్ధురాలు..

నెక్కొండ: నీటి సంపులో పడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని పెద్దకొర్పోలులో జరిగింది. ఎస్సై మహేందర్‌ కథనం ప్రకారం..గ్రామానికి చెందిన మద్దిరాల వరమ్మ (85) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నెల 15న కళ్లు తిరిగి ఇంటి పక్కన ఉన్న నీటి సంపులో పడింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయమై మృతి చెందింది. మృతురాలి కుమారుడు సాంబయ్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సోమవారం తెలిపారు.

రైల్వే ట్రాక్‌పై యువకుడి ఆత్మహత్య

జనగామ: జనగామ రైల్వేస్టేషన్‌ పరిధి బాణా పురం మధ్య రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు సో మవారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. యశ్వంతాపూర్‌–గ్వాలియర్‌ ఎక్స్‌ప్రెస్‌ కింద పడి ఆత్మహత్య చేసుకున్న మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదు. మృతుడి వయసు సుమారు 30 ఏళ్లు ఉంటుంది. బ్లూ జీన్స్‌ ప్యాంట్‌, తెలుపు రంగు టీ–షర్ట్‌ ధరించాడు. కుడి చేతికి కంకణధార కలిగి ఉన్నాడు. తల వెంట్రుకలు సుమారు 1/4 ఇంచుల పొడవులో చిన్నగా ఉన్నాయి. మృతుడి సమాచారం తెలిసిన వారు 9247800433 నంబర్‌కు సమాచారం అందించాలని రైల్వే పోలీసులు పేర్కొన్నారు.

కుక్కల దాడిలో బాలికకు గాయాలు

కేసముద్రం: కుక్కల దాడిలో ఓ బాలిక తీ వ్రంగా గాయపడింది. ఈ ఘటన ము న్సిపాలిటీ పరిధి అమీనాపురం శివారు హనుమంతరావు కాలనీలో సోమవా రం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నా యి. కాలనీకి చెందిన జాటోత్‌ రజిత మనుమరాలు చిన్ను (ఐదేళ్ల వయసు) ఇంటి బయట ఆడుకుంటుడగా కుక్కలు దాడి చేసి మెడ, వీపు భాగాల్లో కరి చాయి. ఇంతలో స్థానికులు ఆ కుక్కలను తరమడంతో ఆ బాలిక ప్రాణంతో బయటపడింది. చికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement