జియాలజిస్టుల పాత్ర కీలకం
కేయూ క్యాంపస్ : ఖనిజాల వెలికితీతలో జియాలజిస్టుల పాత్ర కీలకమని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని జియాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ అడ్వాన్స్‌సెస్ అండ్ చాలెంజెస్ ఇన్ జియాలజీ’ అనే అంశంపై క్యాంపస్‌లోని ఫిజిక్స్ సెమినార్‌హాల్‌లో సోమవారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో వివిధ చోట్ల ఎన్నో రకాల ఖనిజాలు ఉన్నాయన్నారు. ఆ ఖనిజ సంపదను అన్వేషించి వెలికి తీయడం జియాలజిస్టులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్ మాట్లాడుతూ జియాలజీ కోర్సు విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కూడా లభిస్తున్నాయన్నారు. నూతన అన్వేషణ పద్ధతులతో బొగ్గు, లైమ్‌స్టోన్, క్వార్ట్‌గ్రానైట్ వంటి ఖనిజాల నిల్వలను మరింత కచ్చితత్వంతో గుర్తించొచ్చనన్నారు. హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ విశేసాయి మాట్లాడుతూ థార్వర్ క్లాటన్‌లో భూశిల వనరులు ప్రత్యేకంగా మినరల్స్ మట్టి పరిమాణాలు వాటి అన్వేషణ పద్ధతులు వివరించారు. అనంతరం కేయూలో జియాలజీ విభాగం అధిపతి ఆర్. మల్లికార్జున్‌రెడ్డి, ప్రొఫెసర్ ఎంఎం ఆస్లాం మహ్మద్, విశ్రాంత ఆచార్యులు వి. మాధవన్, ఎం. పాండురంగారావు మాట్లాడారు. ఈ సదస్సులో అతిథులు సదస్సు అబ్‌స్ట్రాక్ట్ (సావనీర్) ఆవిష్కరించారు. పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈసదస్సునేటి(మంగళవారం) తో ముగియనుంది.
కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం


