కేయూ క్యాంపస్ : గృహల్లో ఉత్పత్తయ్యే ఆహారఅవశేషాల(తడి వ్యర్థాలు, కూరగాయల తొక్కలు) నుంచి బయోగ్యాస్‌ను తయారు చేయొచ్చునని హైదరాబాద్ ఐఐసీటీచీఫ్ సైంటిస్టు ఎ. గంగాగ్నిరావు అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభా గం ఆధ్వర్యంలో క్యాంపస్‌లోని పరిపాలన భ వనం సెనేట్‌హాల్‌లో సోమవారం ‘కరెంట్ రీసెర్చ్ ఇన్ కెమికల్ సైన్సెస్ 2026’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. అలాగే ‘గృహా సంబంధ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి’ అనే అంశంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అనంతరం కేయూ రిజి స్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ నూతన ఆవి ష్కరణలు మానవాళికి ఉపయోగపడాలన్నారు. హైదరాబాద్‌లోని హెట్రో డ్రగ్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.మురళి మాట్లాడుతూ యూనివర్సిటీలు, పరిశ్రమలు పరస్పరం అనుసంధానమై పనిచేసినప్పుడే నూతన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయన్నారు. కెమిస్ట్రీ విభాగం అధిపతి ఎన్.వాసుదేవరెడ్డి, సైన్స్‌విభాగాల డీన్ జి. హనుమంతు, బిట్స్ ఫిలానీ ఆచార్యుడు ఎ. అమిత్‌నాగ్, ఐఐసీటీ శాస్త్రవేత్తలు రవిశంకర్, ఆర్. నాగరాజు మాట్లాడారు. ఆచార్య ఎస్. జ్యోతి, అధ్యాపకులు మమత, టి. రాజమణి, రంగారెడ్డి, ఎన్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అబ్‌స్ట్రాక్ పరిశోధనపత్రాల బుక్‌లెట్‌ను అతిథులు ఆవిష్కరించారు. ఈసదస్సునేటి(మంగళవారం)తో ముగియనుంది.
హైదరాబాద్ ఐఐసీటీ చీఫ్ సైంటిస్టు
గంగాగ్నిరావు


