డిమాండ్‌ అంచనా మేరకు చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

డిమాండ్‌ అంచనా మేరకు చర్యలు తీసుకోవాలి

Mar 17 2026 8:22 AM | Updated on Mar 17 2026 8:22 AM

హన్మకొండ: వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ అంచనాల మేరకు సత్వర చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈ, డీఈలను టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి ఆదేశించారు. వేసవిలో చేపట్టాల్సిన విద్యుత్‌ పనుల పురోగతిపై సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని కార్పొరేట్‌ కార్యాలయం నుంచి ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్‌ఈ, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ 33 కేవీ, 11 కేవీ ఫీడర్ల వారీగా సమీక్షిస్తూ ఓవర్‌ లోడ్‌ లేకుండా లోడ్‌ బదలాయింపు చేపట్టాలన్నారు. అవసరమున్న చోట ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచాలని, ఈ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు సంభవించే ప్రకృతి విపత్తుకు సమాయత్తం కావాలన్నారు. 17 సర్కిళ్ల పరిధిలోని మీటర్లు లేని అంగన్‌వాడీ కేంద్రాలకు యుద్ధప్రాతిపదికన అమర్చాలన్నారు. మోడల్‌ సోలార్‌ గ్రామాల పను ల పురోగతిపై సమీక్షిస్తూ.. పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. సి.ఈలు టి.తిరుమల్‌ రావు, రాజు చౌహాన్‌, అశోక్‌, సురేందర్‌, అన్నపూర్ణ, జీఎంలు శ్రీ నివాస్‌, నాగప్రసాద్‌, మల్లికార్జున్‌, వాసుదేవ్‌, వేణుమాధవ్‌, ఈఈ సివిల్‌ వెంకటేశ్వర్లు, డి.ఈలు అనిల్‌ కుమార్‌, భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement