ఖిలా వరంగల్: సేంద్రియ వ్యవసాయంతోనే ఖ ర్చులు తగ్గి అధిక లాభాలు వస్తాయని ప్రధాన శాస్త్రవేత్త వెంకన్న, ఉద్యాన శాఖ అధికారి తిరుపతి, ఏరువాక శాస్త్రవేత్త రాజ్‌కుమార్, మట్టి పరీక్షల ప్రయోగశాల వ్యవసాయ అధికారి గోవర్ధన్‌రెడ్డి, బయో కంట్రోల్ ల్యాబ్ శాస్త్రవేత్త బి. మాధవి అన్నారు. వరంగల్ వ్యవసాయ శాఖ భవనంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) సహకారంతో వరి పంటల ప్రాధాన్యమైన రకాల ప్రోత్సాహం, హెచ్‌టీ పత్తి సాగు ప్రతికూల ప్రభావాలు, భూసార పరీక్షల ఆధారంగా రసాయ ఎరువుల వాడకం, నూ తన వ్యవసాయ పద్ధతులపై రైతులకు 2రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. వారు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్న సన్న రకాల ఎంపిక, నాణ్యమైన విత్తనాల వినియోగం, పురుగులు, వ్యాధులు నియంత్రణ, నేల పరీక్షల ప్రాముఖ్యత, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓ నెలకుర్తి రవీందర్‌రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి, ఆశాదీప్, తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన శాస్త్రవేత్త వెంకన్న


