కేయూ క్యాంపస్ : వెల్లూరులోని విట్ యూనివర్సి టీలో ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు జరగను న్న ఆలిండియా హ్యాండ్ బాల్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్‌లో కాకతీయ యూనివర్సిటీ హ్యాండ్‌బాల్ పురుషుల జట్టు పాల్గొనబోతుందని స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య ఆదివారం తెలి పారు. ఈ జట్టులో బి. సాయికుమార్, బి. వంశీ, ఎం. శ్రీరామ్ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నర్సంపే ట), డి. శ్రీనివాస్, బి. శివాజీ, బి. రాజేందర్, ఎం. సాయికుమార్, కె. గణేశ్ (యూసీపీఈ ,కేయూ), పి. సాయి (వాగ్దేవి డిగ్రీ కళాశాల, హనుమకొండ), వి.సాయికృష్ణ (ఎల్‌బీ కాలేజీ, వరంగల్), ఎం. రో హిత్ (కిట్స్, వరంగల్), పి. రామారావు, ఎం. శ్రీరా మ్, వై. భద్రు (ఎస్‌ఆర్‌అండ్‌బిజిఎన్‌ఆర్ డిగ్రీక ళా శాల, ఖమ్మం), కె. ధర్మభిక్షం (వికాస్ డిగ్రీ కళాశాల ,ఖమ్మం) ఉన్నారని వెంకయ్య తెలిపారు. ఈ జట్టుకు నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రమేశ్‌కోచ్‌గా కొత్తగూడెం ఎంజేపీ టీబీ సీడబ్ల్యూ ఆర్‌డీసీ ఫిజికల్ డైరెక్టర్ రఘువరణ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు.
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
ఇనుగుర్తి : కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కోమటిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై గంగారపు కరుణాకర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన విలాసాగర్ మురళి (46) తనకున్న 20 గుంటల వ్యవసాయ భూమిని అమ్మి ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇదిలా ఉండగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన మురళి ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తైలిపారు.


