వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన 3వ తెలంగాణ రాష్ట్ర స్థాయి రిలే కార్నివాల్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలను వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ గట్టు మహేశ్‌బాబు ము ఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, నిత్యం సాధన చేసే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. జాతీయ స్థాయిలోనూ రాణించి జి ల్లా, రాష్ట్ర ఖ్యాతిని చాటాలని క్రీడాకారులకు సూచించారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ ఉమ్మ డి పది జిల్లాల నుంచి 363 మంది అథ్లెట్లు పాల్గొనగా, అండర్–14, 20 విభాగాలతోపాటు మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 28వ తేదీన చంఢీఘడ్‌లో జరగనున్న జాతీయ స్థాయి రిలే కార్నివాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం పలు విభా గాల్లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు సర్టిఫికెట్లు, పతలును అందజేశారు. అథ్లెటిక్స్ సంఘం బాధ్యులు పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, కిషన్ పాల్గొన్నారు.


