● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
మహబూబాబాద్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురం గ్రామంలో ఆదివారం మంద మధు, లేకోటి రమేశ్ నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నెరవేర్చడానికే ఇందిరమ్మ ఇళ్ల పథకమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. ఇంటి నిర్మాణం చేసుకుంటేనే బిల్లులు వస్తాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి, తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్, నాయకులు అంజయ్య, హరిసింగ్ పాల్గొన్నారు.


