● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: జిల్లాలో పక్కాగా జనగణన నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆదివారం జనాభా లెక్కలు 2027, శిక్షణ తరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి దశ జనగణన మే 11నుంచి జూన్2 వరకు, రెండోదశ ఫిబ్రవరి 2027లో జరుగుతుందన్నారు. 2027 మార్చి 1ని రెఫరెన్స్ తేదీగా పరిగణిస్తారన్నారు. డిజిటల్ విధానంలో సర్వే జరుగుతుందన్నారు. ప్రత్యేక పోర్టల్ గణన ప్రారంభానికి ముందు అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఓ శ్రీనివాసరావు, సీపీఓ విభాగం అధికారులు అశోక్, రామ్‌దన్, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


