నెహ్రూసెంటర్: అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని, అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి స్నేహబిందు అన్నా రు. అంగన్‌వాడీల సమస్యలపై ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల వేతనం రూ. 18వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, వెంటనే అమలు చేయాలని కోరారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2026ను సవరించాలని, టీచర్, ఆయాలకు మే నెల సెలవులు ఇవ్వాలన్నారు. అంగన్‌వాడీల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో మల్లికాంబ, దుర్గా, కనకలక్ష్మి, సరస్వతి, కొమురమ్మ, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.


