తిరుమలగిరి (తుంగతుర్తి): లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం వద్ద శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుమలగిరికి వస్తుండగా.. తిరుమలగిరి నుంచి తొర్రూరు వైపునకు వెళ్తున్న లారీ వెలిశాల వద్ద బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సంతోష్‌గౌడ్‌కు కడుపులో గాయాలయ్యాయి. బస్సులోని ప్రయాణికురాలు బోళ్ల అంజమ్మకు చెయ్యి విరిగింది. మరో పది మందికి గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ దీపక్ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో స్థానికులు అతడిని అతికష్టం మీద బయటకు తీశారు. లారీ డ్రైవర్ కుడి కాలు విరిగింది. ఘటనాస్థలిని ఎసై్ౖస వెంకట్‌రెడ్డి సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


