విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక

Mar 15 2026 1:27 AM | Updated on Mar 15 2026 1:27 AM

ఆలోచనలు ప్రోత్సహించాలి

హసన్‌పర్తి : విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం, పరిశోధనా సంస్కృతిని పెంపొంచడం ప్రగతి ప్రాజెక్ట్‌ ఎక్స్‌పో లక్ష్యమని రేవల్సిస్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు రాజ్‌ సామల అన్నారు. ఎస్సార్‌ యూనివర్సిటీలో శనివారం ‘ప్రగతి–నేషనల్‌ లెవల్‌ ప్రాజెక్టర్‌ ఎక్స్‌పో 26’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోని 23 విశ్వ విద్యాలయాలతోపాటు పలు ఇంజనీరింగ్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని వందకు పైగా వినూత్న ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి రాజ్‌ సామల ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వినూత్న ఆలోచనలను అభినందిస్తూ ఇంజనీరింగ్‌ విద్యలో ప్రాక్టిక్‌ లెర్నింగ్‌, ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మేరోబోటిక్స్‌, కృత్రిమ మేధస్సు, ఆరోగ్య సాంకేతికత, స్మార్ట్‌ సిస్టమ్స్‌, సస్టైనబుల్‌ ఇంజనీరింగ్‌ వంటి విభిన్న రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈసందర్భంగా వోఎక్సెన్‌ విశ్వవిద్యాలయ బృందానికి ప్రథమ బహుమతి, ఎస్సార్‌ విశ్వవిద్యాలయ బృందం ద్వితీయ బహుమతి, శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ బృందం తృతీయ బహుమతి అందుకున్నారు. కార్యక్రమంలో కెనరా బ్యాంకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌. కుమార్‌, ఎస్సార్‌ యూనివర్సిటీ వీసీ దీపక్‌ గార్గ్‌, రిజిస్ట్రార్‌ పి.వి. రమణరావు, డీన్‌. అర్చనారెడ్డి, సి. హెచ్‌. హుస్సేన్‌ బాషా, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

రేవల్సిస్‌ టెక్నాలజీస్‌

వ్యవస్థాపకుడు రాజ్‌ సామల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement