నాటక రంగానికి పూర్వ వైభవం తేవాలి | - | Sakshi
Sakshi News home page

నాటక రంగానికి పూర్వ వైభవం తేవాలి

Mar 15 2026 1:27 AM | Updated on Mar 15 2026 1:27 AM

తొర్రూరు: సమాజానికి దిశానిర్దేశం చేసే నాటక రంగానికి పూర్వవైభవం తేవాలని సినీగేయ రచయిత కాసర్ల శ్యామ్‌ కోరారు. తొర్రూరులో చైతన్య కళాసమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి నాటక పోటీలు శనివారం ముగిశాయి. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ నాటకరంగాన్ని బతికించుకోవాల్సి న బాధ్యత అందరిపై ఉందని, సమాజంలోని రుగ్మతులను తొలగించేందుకు నాటకాలు ఎంతో దోహదపడుతాయన్నారు. నాటకాలతో ఒత్తిడి దూరం అవుతుందని పేర్కొన్నారు. అనంతరం జాతీయస్థాయి నాటక పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన గుంటూరుకు చెందిన ఉషోదయ కళానికేతన్‌ సంస్థకు, ద్వితీయ స్థానం సాధించిన హైదరాబాద్‌కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్‌ సంస్థ కళాకారులకు నగదు, బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో చైతన్య కళాసమాఖ్య ప్రతినిధులు మన్నూరు ఉమ, పినాకపాణి, మంగళపల్లి శ్రీనివాస్‌, జినుగ సురేందర్‌రెడ్డి, లింగాల వెంకటనారాయణగౌడ్‌, సర్వి వెంకన్న, లేగల వెంకట్‌రెడ్డి, బుదారపు శ్రీనివాస్‌, మాచర్ల వెంకన్న, గడల శ్రీనివాస్‌, ఇమ్మడి రాంబాబు, కళాకారులు పాల్గొన్నారు.

సినీగేయ రచయిత కాసర్ల శ్యామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement