మహబూబాబాద్:గ్యాస్ సరఫరాలో అసత్య ప్రచారాలు నమ్మొద్దని, తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ స్నేహ శబరీష్ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో గ్యాస్ సరఫరాపై సంబంఽధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 11ఏజెన్సీల పరిధిలో 2,121,131 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. వారం నుంచి 13,985 సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. డిమాండ్‌కు అనుగుణంగా సంబంఽధిత ఏజెన్సీల వద్ద వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలిండర్ల నిల్వ లు ఉన్నాయన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సివిల్ సప్లయీస్, విజిలెన్స్ కమిటీ సభ్యులు నిత్యం గ్యాస్ డీలర్ల వద్ద స్టాక్‌ను పరిశీలించాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్లు మాత్రమే ఉపయోగించాలన్నారు. డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. డెలివరీ బాయ్‌కి ఓటీపీ చెప్పి సహకరించాలన్నారు. వినియోగదారులు కేవైసీ పూర్తి చేసుకోవాలన్నారు. ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది పరిస్థితి లేదని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు నమ్మొద్దన్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, సీఎస్ రామకృష్ణారావు, సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలతో గ్యాస్ సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీసీఎస్‌ఓ రమేశ్, డీఎఎస్పీ తిరుపతి రావు, సంబంధిత అఽధికారులు పాల్గొన్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
వారంలో రెండు సార్లు పక్కాగా తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరించి తగు చర్యలు తీసుకోవాలని, ప్రధానంగా నాణ్యతా ప్రమాణాల విషయంలో ఉపేక్షించే లేదని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం జిల్లాస్థాయి అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో ఫుడ్ స్టేఫ్టీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొ ప్పో, అనిల్‌కుమార్, ఫుడ్ స్టేఫ్టీ అధికారి ధర్మేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఆకస్మిక తనిఖీ..
కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలను కలెక్టర్ స్నేహశబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను, ఆన్‌లైన్ ఫైలింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్యాలయంలో పరిశుభ్రత పాటించాలన్నారు. పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేయాలన్నారు.
కలెక్టర్ స్నేహశబరీష్


