మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీలోని ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్‌రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ హాజరయ్యారు. సంబంధిత అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న మౌలిక వసతులు, శానిటేషన్, తాగునీటి సరఫరా తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అప్పుడే అభివృద్ధి జరుగుతుందన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కాలం సునీత, కౌన్సిలర్లు గుగులోతు నీలా, గంట్ల గౌతమ్‌రెడ్డి, రాము, రమేశ్, కాంతమ్మ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్
మరిపెడ మున్సిపల్ కౌన్సిల్
సాధారణ సమావేశం


