నెహ్రూసెంటర్: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు డాక్టర్ కందుల నాగరాజు అన్నా రు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో పని చేస్తున్న ఉద్యోగులకు 6 నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారని, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు ప్రతీ నెల 1వ తేదీన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వేతనాలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం కవిత, పవన్, దార్ల జ్యోతి, యగ్నేశ్వర్, సలెహా, రెహానా, వెంకటమ్మ, మౌలాబీ, శివ తదితరులు పాల్గొన్నారు.


