జఫర్‌ఘఢ్: సామాజిక ఉద్యమకారుడు, మా ఇల్లు అనాథాశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్యను గురువారం రాత్రి ఎన్‌ఐఏ పోలీసులు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఉపా చట్టం కింద అరెస్ట్ అయిన ఇన్నయ్య చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. ఇటీవల ఆయన తండ్రి సాల్మోన్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. తండ్రి దశదిన కర్మలో పాల్గొనేందుకు కోర్టు ఇన్నయ్యకు ఐదు రోజులపాటు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దీంతో స్వగ్రామం సాగరానికి వచ్చిన ఇన్నయ్య దశదిన కర్మలో పాల్గొన్నారు. బెయిల్ గడువు ముగియడంతో ఆయనను ఎన్‌ఐఏ పోలీసులు భద్రత నడుమ తిరిగి జైలుకు తరలించారు.
కాల్వలో పడి వ్యక్తి మృతి
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ పెద్దమ్మగడ్డ సమీపంలోని కాకతీయ కెనాల్ నుంచి పొలాలకు వెళ్లే కాల్వలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దమ్మగడ్డ శివారు జ్యోతిబసునగర్ కాలనీ ఫేజ్–2కు చెందిన పెండ్యాల విజయ్ కుమార్ (52) కార్పెంటర్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం మద్యం మత్తులో కెనాల్‌కు చెందిన పిల్ల కాల్వలో పడి మృతి చెందాడు. కాగా, కాలనీకి చెందిన కొంత మందితో తన సొదరుడికి గొడవలు జరుగుతున్నాయని, అవి మనసులో పెట్టుకుని హ్యత చేసి కాల్వ లో పడేసినట్లు మృతుడి సోదరుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జనగామలో కారు బీభత్సం..
జనగామ: జనగామ పట్టణం జీఎంఆర్ కాలనీలో బుధవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు వంటి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిచడమే కాకుండా స్పీడ్‌గా దూసుకొచ్చి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి, అనంతరం అదే కాలనీలోని ఓ ఇంటి ప్రహరీని ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ విషయం పోలీసులకు తెలుస్తుందనే భయంతో యజమానులు కారును గ్యారేజీకి తరలించి బైక్‌లను కూడా సీక్రెట్‌గా బాగుచేయించే యత్నాలు చేసినట్లు సమాచారం. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదం జరగడానికి గల కారణాలను పోలీసుల దర్యాప్తులో తేల్చాల్సి ఉంటుంది.
● అదుపు తప్పి బైక్‌లకు ఢీ..
● ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం


