మరణంలోనూ వీడని స్నేహ బంధం.. | - | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని స్నేహ బంధం..

Mar 13 2026 8:55 AM | Updated on Mar 13 2026 8:55 AM

మరిపెడ రూరల్‌: వరుసకు బావబామ్మర్దులు అయిన వారిద్దరు ప్రాణ స్నేహితులు. ఎక్కడికెళ్లినా ఇద్దరు కలిసే వెళ్లేవారు. ఏ పని అయినా కలిసి చేసేవారు చదువు, ఉద్యోగం, పని ప్రదేశం.. ఇలా ప్రతీ చోట కలిసి ఉండేవారు. చివరకు మరణంలోనూ వీడిపోలేదు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం లచ్చతండా సమీపంలోని మహబూబాబాద్‌– సూర్యాపేట 365 జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరిపెడ అదనపు ఎస్సై కోటేశ్వర్‌రావు, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామానికి చెందిన బల్లెం ఉదయ్‌ కిరణ్‌ (22), బండి భిక్షం (22) ప్రాణస్నేహితులు. ఇద్దరూ హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఉదయ్‌కిరణ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌గా, భిక్షం వాటర్‌ ప్లాంట్‌లో పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉప్పలమ్మ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఉదయ్‌కిరణ్‌ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. భిక్షం కూడా హైదరాబాద్‌ నుంచి వచ్చాడు. దీంతో ఉదయ్‌ కిరణ్‌ బైక్‌పై మహబూబాబాద్‌ వెళ్లి మిత్రుడిని పికప్‌ చేసుకుని కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామంలోని తన సోదరి ఇంటికి వెళ్లారు. ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మార్గమధ్యలో మరిపెడ మండలం లచ్చతండా వద్ద గుర్తుతెలియని వాహనం.. బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న మరిపెడ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కోటేశ్వర్‌రావు తెలిపారు. కాగా, ఈదుర్ఘఘటనతో మృతుల కుటుంబాలతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

రోడ్డు ప్రమాదంలో మిత్రులు దుర్మరణం

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం

బైక్‌పై స్వగ్రామం వస్తుండగా ఘటన..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement