డోర్నకల్: గాలికుంటు నివారణ టీకాలతో పశువులకు మేలు జరుగుతుందని జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి కిరణ్‌కుమార్ అన్నారు. మండలంలోని అమ్మపాలెం గ్రామంలో గురువారం చేపట్టిన పశువుల టీకాల శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మూడు నెలలు దాటిన దూడలతో పాటు చూడి పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని కోరారు. గాలికుంటు వ్యాధి సోకితే పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గుతుందని, దూడలు చనిపోయే ప్రమాదం ఉన్నందున తప్పనిసరిగా టీకాలు వేయించాలని కోరారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి నాగేశ్వర్‌రావు, సిబ్బంది చంద్రయ్య, సులేమాన్, రవి తదితరులు పాల్గొన్నారు.


