కాజీపేట రూరల్: అమృత్ భారత్ పథకం కింద రూ.25 కోట్లతో కాజీపేట రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి అన్నారు. పార్టీ నాయకులతో కలిసి బుధవారం కాజీపేట రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ రూ.716 కోట్లతో కాజీపేటలోని చేపట్టిన కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలో ప్రారంభానికి సిద్ధం ఉందని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి, నాయకులు డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, దొంతి దేవేందర్‌రెడ్డి, పులి సరోత్తంరెడ్డి, కాచం గురుప్రసాద్, కందగట్ల సత్యనారాయణ, మేకల శ్రావణ్ యాదవ్, మధు, మేఘనాథ్, కార్పొరేటర్లు గుజ్జుల వసంత, బైరి శ్రావణ్, రావుల కిషన్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి


