మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి

Mar 12 2026 8:30 AM | Updated on Mar 12 2026 8:30 AM

అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో

మహబూబాబాద్‌: మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు పలు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నిజమైన మహిళా సాధికారత ఇంటి నుంచే ప్రారంభమవుతుందన్నారు. సమాజంలో మహిళల భద్రత కేవలం వారి సమస్యగా మాత్రమే కాకుండా అందరి బాధ్యతగా భావించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, డీడబ్ల్యూఓ సబిత, టీఎన్జీఓఎస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, డీపీఆర్వో రాజేంద్ర ప్రసాద్‌, సంబంధిత అఽధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement