తొర్రూరు: సమాజ చైతన్యానికి మూలం నాటికలు అని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. చైతన్య కళా సమాఖ్య ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలోని గరుగుబావి వద్ద రెండో రోజు జాతీయ స్థాయి నాటిక ప్రదర్శనలు కొనసాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నాటికలను ప్రారంభించారు. గంజాయి ప్రభావం వల్ల యువతరం ఎలా పెడదోవ పడుతుందో ‘తితీక్ష’ నాటిక ద్వారా కళాకారులు సందేశమిచ్చారు. మెట్టినింట వరకట్న వేధింపుల వల్ల మహిళలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ‘పుత్తడి బొమ్మ’ నాటికలో అద్భుతంగా చూపారు. కళాకారులను ఎమ్మెల్సీ అభినందించారు. చలనచిత్రాలు రాకముందు నాటకరంగమే వినోదానికి మూలాధారంగా ఉండేదని, నాటికల ద్వారా సమాజాన్ని చైతన్య పరచాలని కోరారు. కార్యక్రమంలో మహబూబాబాద్ కౌన్సిలర్ ముత్యం వెంకన్న, సమాఖ్య అధ్యక్షుడు మన్నూరు ఉమ, ప్రధాన కార్యదర్శి పినాకపాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్‌రెడ్డి, ప్రతినిధులు మంగళపల్లి శ్రీనివాస్, ప్రవీణ్‌రాజు, గడల శ్రీనివాస్, లేగల వెంకట్‌రెడ్డి, జనార్దన్‌రాజు, ఇమ్మడి రాంబాబు, కళాభిమానులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు


