మహబూబాబాద్: జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల్లో ఫైళ్ల క్లియరెన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని గదులు తిరిగి స్వయంగా ఫైళ్లను పరిశీలించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఫైళ్ల క్లియరెన్స్, శానిటేషన్ సమస్య పరిష్కరించాలన్నారు. పనుల దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. కాలనీల్లో విద్యుత్, తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. శానిటేషన్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. కార్యాలయంలో ఫైళ్ల నిర్వహణ, అడ్డగోలుగా బీరువాలు ఉండడంపై కమిషనర్ రాజేశ్వర్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్, మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి, అధికారులు ఉన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్
కమిషనర్‌పై ఆగ్రహం


