విద్యుత్‌ స్తంభాలకు యూనిక్‌ నంబర్లు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభాలకు యూనిక్‌ నంబర్లు

Mar 9 2026 7:38 AM | Updated on Mar 9 2026 7:38 AM

నెహ్రూసెంటర్‌: జీఐఎస్‌ అసెట్‌ మ్యాపింగ్‌ అండ్‌ ట్రాకింగ్‌ ప్రక్రియలో భాగంగా 33కేవీ లైన్లలోని 34 ఫీడర్ల పనులు పూర్తిచేశామని, 11 కేవీ లైన్లలోని 300 ఫీడర్లకు యూనిక్‌ పోల్‌ నంబర్స్‌ పెయింటింగ్‌ చేపట్టామని విద్యుత్‌ శాఖ మహబూబాబాద్‌ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ విజేందర్‌ రెడ్డి ఆదివారం తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా స్తంభాల వారీగా పెట్రోలింగ్‌ నిర్వహించడం సులభమవుతుందని, అలాగే నిర్వహణ పనులను కూడా సమర్థవంతంగా చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. గతంలో జరిగిన విద్యుత్‌ అంతరాయాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలు వంటి వివరాలను కూడా సులభంగా ట్రాక్‌ చేసుకునే సౌలభ్యం ఉంటుందన్నారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే ఆ పోల్‌ నంబర్‌ ఆధారంగా వెంటనే ఆ ప్రాంతం లొకేషన్‌ మ్యాపింగ్‌ తెలుసుకొని, అక్కడికి త్వరగా చేరుకొని సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు.

దరఖాస్తుల ఆహానం

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో వివిధ కోర్సులకు గాను అవసరమైన మెటీరియల్‌ కొనుగోలు సంబంధించి సీల్డ్‌ కొటేషన్లు కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టెండరు బాక్స్‌లో సీల్డ్‌ కొటేషన్లు సమర్పిచాలన్నారు. ఈ నెల 13న మధ్యాహ్నం 12గంటలకు జిల్లా కొనుగోలు కమిటీ సభ్యుల సమక్షంలో సీల్డ్‌ కొటేషన్లు తెరుస్తామని, ప్రభుత్వ ఐటీఐ కళాశాల మహబూబాబాద్‌కు రూ. 6,52,800 బడ్జెట్‌ కేటాయించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ బాబు ఫోన్‌ నంబర్‌ 9441454947లో సంప్రదించాలన్నారు.

టీ–శాట్‌లో విద్యార్థులకు మోటివేషన్‌

మహబూబాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు టీ–శాట్‌లో నేడు(సోమవారం) ఉదయం 10:30నుంచి 12:30గంటల వరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యాదర్శి యోగితారాణా మోటివేషన్‌ సందేశం ఇవ్వనున్నట్లు డీఈఓ రాజేశ్వర్‌ ఆదివారం తెలిపారు. ప్రతీ హైస్కూల్‌లో మోటివేషన్‌ తరగతులను విద్యార్థులు వీక్షించే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. అదేవిధంగా పరిచయం కార్యక్రమంలో కార్యదర్శితో మాట్లాడే విధంగా విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు.

ఉద్యోగులకు

పీఆర్సీ ప్రకటించాలి

విద్యారణ్యపురి: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం హనుమకొండలో జరిగిన టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మేనిఫెస్టోలో పీఆర్‌సీని 6 నెలల్లోనే అమలు చేస్తామని, డీఏలు ప్రకటిస్తామని, పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేస్తామని చెప్పి నేటివరకు ఒక్క హామీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పీఆర్‌సీ 36 నెలలపాటు నష్టపోయారని, ప్రస్తుత ప్రభుత్వం వచ్చి కూడా 33 నెలలు గడిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా పీఆర్‌సీ నివేదికను తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని చావా రవి డిమాండ్‌ చేశారు. విద్యాకమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి ఉపాధ్యాయుల వేతనాలపై చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. జీతభత్యాలను నిర్ణయించేంది పీఆర్సీ అని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతే విద్యాకమిషన్‌ నివేదికపై నిర్ణయం తీసుకోవాలన్నారు. బెనిఫిట్స్‌ అందకపోవడంతో రిటైర్డ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మనోవేదనకు గురువుతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటికే పలువురు మరణించారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ విడుదల చేసి బెనిఫిట్స్‌ను చెల్లించాలని, ఎయిడెడ్‌, గురుకులాలు, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement