కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు సోమవారం భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. మహాజాతర ముగిసి రెండు రోజులు అవుతున్నా మేడారానికి భక్తుల తాకిడి తగ్గలేదు. వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి వచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర సారె, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారానికి 10 కిలోమీటర్ల దూరానికి వెళ్లి వంటావార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు.


