ఘనంగా తిరుపతమ్మ గోపయ్య కల్యాణం
గార్ల: గార్లలోని తిరుపతమ్మ దేవాలయంలో గోపయ్య సమేత తిరుపతమ్మ కల్యాణ మహోత్సవాన్ని సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితుడు శ్రీరామశాస్త్రి మంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు. కల్యాణం సందర్భంగా పీటలపై శీలంశెట్టి రాంభద్రయ్య సుభద్ర, శీలంశెట్టి నవీన్ కీర్తి, కోటేష్ ఉమ దంపతులు కూర్చున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించి భక్తి పారవశ్యం పొందారు. కల్యాణ మహోత్సవంలో సర్పంచ్ బానోత్ పార్వతి హతీరాం, శీలంశెట్టి ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్, ఎస్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ధ్రువపత్రాలు అందజేయాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న బీసీ, ఈబీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకున్న ధ్రువపత్రాలను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కార్యాలయంలో అందజేయాలని బీసీ సంక్షేమ శాఖ అధికారి బి.శ్రీనివాస్‌రావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 విద్యాసంసవత్సరం దరఖాస్తు ఫారాలను మాత్రమే అందజేయాలని, కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు తప్పనిసరిగా పూర్తి బాధ్యతతో విద్యార్థుల వివరాలు సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.


