వర్ణనాతీత బాధలు | - | Sakshi
Sakshi News home page

వర్ణనాతీత బాధలు

Feb 1 2026 3:35 AM | Updated on Feb 1 2026 3:35 AM

వర్ణన

వర్ణనాతీత బాధలు

వాహనాల బారులు..

ఆగ్రహించిన భక్తులు.. ముఖం చాటేసిన అధికారులు..

వాహనాల బారులు..

రెండు లక్షల మందికి వైద్య సేవలు

ములుగు డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు

మేడారం(భూపాలపల్లి అర్బన్‌): నాలుగు రోజుల మహాజాతరలో భాగంగా మేడారంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాల్లో రెండు లక్షల మంది భక్తులకు వైద్య సేవలు అందించినట్లు ములుగు డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు శనివారం తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈ నెల 28 నుంచి 31 తేదీ వరకు 50 పడకల తాత్కాలిక ఆస్పత్రి, 30 వైద్య శిబిరాలను నిర్వహించినట్లు తెలిపారు. 1,88,701లక్షల మందికి ఓపీ సేవలు, 2,990 ఐపీ సేవలు నిర్వహించామన్నారు. 83 మందిని మెరుగైన వైద్య సేవలకు ములుగు, వరంగల్‌ ఎంజీఎం రెఫర్‌ చేసినట్లు తెలిపారు. 7,486 మందికి వివిధ రకాలతో గాయాలు కాగా వైద్య సేవలు అందించామన్నారు. ఒకరు పాము కాటు, 159 మంది తేలు కాటు, 166 మంది కుక్క కాటుకు గురయ్యారన్నారు. జాతరలో ఒక మహిళ ప్రసవించగా వివిధ కారణాలతో నలుగురు మృతి చెందినట్లు తెలిపారు.

మేడారం బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులు

వరంగల్‌ క్రైం : కోటి ఆశలతో తల్లులను తనవితీరా దర్శించుకోవాలని దేశం నలుమూలల నుంచి తరలొచ్చిన భక్తులకు పోలీసు అధికారుల సమన్వయ లోపం శాపంగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం తాడ్వాయి నుంచి మేడారం(సుమారు 13 కి.మీ) రావడానికి సుమారు 4 గంటల సమయం పట్టగా.. రాత్రి సమయంలో 45 కిలోమీటర్ల(ములుగు నుంచి మేడారం) దూరానికిగాను సుమారు 12 గంటల సమయం పట్టింది. దీనిని బట్టి మహాజాతరలో ట్రాఫిక్‌ ఏ స్థాయిలో స్తంభించిందో అర్థమవుతోంది. అర్థరాత్రి అడవిలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఫలితంగా ఏం జరుగుతుందో తెలియని దయనీయ పరిస్థితుల్లో భక్తులు నరకం చూశారు. రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్‌ ఎందుకు నిలిచిందో తెలియని పరిస్థితి.

సమన్వయ లోపం..భక్తులకు శాపం...

వివిధ శాఖలను సమన్వయం చేసి జాతరను విజయవంతంగా నిర్వహించాల్సిన అధికారుల మధ్యే ప్రధానంగా సమన్వయం లోపించింది. వీరి సమన్వయ లోపమే భక్తుల పాలిట శాపమైంది. మేడారం ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి తాడ్వాయి మార్గంలో వర్షాకాలంలో చెట్లు కూలిన ప్రాంతం వరకు బస్సులు గంటకు అడుగు దూరం కూడా కదలేకపోయాయి. దీనికి తోడు వీఐపీల వాహనాల సైరన్‌ మోతలు భక్తులు చిరాకు కలిగించాయి. తాడ్వాయి నుంచి పస్రాకు 18 కిలోమీటర్ల దూరం సుమారు 8 గంటల సమయం పట్టింది. శుక్రవారం రాత్రి రోడ్డుపై బస్సులు, వాహనాలు కిలో మీటర్ల దూరం నిలిచిపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి పిల్లలతో అడవిలోనే కొందరు నిద్రించగా మరి కొందరు నడకతో తాడ్వాయి చేరుకున్నారు. గంటల తరబడి కనీసం తాగడానికి నీళ్లు కూడా లభించలేదు. ఆకలితో అలమటించి చివరకు చేసేది ఏమి లేక కొంత మంది బస్సులు ఎక్కడ నిలిచాయో అక్కడే వంటలు చేసుకున్నారు. పోలీసు అధికారుల మధ్య సమన్వయ లోపం జాతర సక్సెస్‌ కాకపోవడానికి కారణంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు కేవలం గద్దెలు, వీఐపీల దర్శనాల పైనే దృష్టిసారించారే తప్ప జాతరలో ఎక్కడ ఏం జరుగుతుంది? భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? తిరుగు ప్రయాణానికి ఎన్ని బస్సులు అవసరం, ప్రైవేట్‌ వాహనాలు ఏ మార్గంలో వెళ్తున్నాయి? హైవే పెట్రోలింగ్‌ ఎలా సాగుతుంది? ట్రాఫిక్‌ జామ్‌ అయితే ప్లాన్‌ బీ ఏంటి వంటి అంశాలను పెడచెవిన పెట్టడం కూడా ట్రాఫిక్‌ స్తంభించడానికి మరో కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. వందలాది వాహనాలు రోడ్ల మీద ఎక్కడికక్కడే నిలిచిపోతే పోలీసు అధికారులు ఏం చేశారు...? అనే ప్రశ్నకు అధికారులతోపాటు మొదటి నుంచి జాతరలో అన్ని తానై వ్యవహరించిన వారి దగ్గర కూడా ఎలాంటి సమాధానం రావడం లేదు. ఏది ఏమైనా తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతర నిర్వహణలో నిర్వాహకుల ఒంటెద్దు పోకడలు భక్తులకు మాత్రం నరకం చూపాయి.

తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

మేడారం జాతరకు జాతీయ స్థాయి గుర్తింపు కోసం విన్నంచుకుంటున్న ప్రభుత్వం, అధికారులు ఏర్పాట్ల విషయంలో మాత్రం లోకల్‌ స్థాయిలో కూడా చేయలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. మేడారంలో గద్దెల నిర్మాణం, జంక్షన్లు, రోడ్ల విస్తరణ, ఏఐ టెక్నాలజీ, వందల సంఖ్యలో సీసీ కెమెరాల ఏర్పాటు, డ్రోన్లు.. ఇలా ఎన్ని సౌకర్యాలు వినియోగించిన భక్తులకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు. అభివృద్ధి పనులు చేసి మార్కును ప్రదర్శించిన ప్రభుత్వం భక్తుల కనీస సౌకర్యాలను గాలికొదిలేసిందనే ఆరోపణలు వినిపించాయి. ఫలితంగా జాతరలో ప్రధాన ఘట్టంగా పేర్కొనే ఇద్దరు తల్లులు గద్దెల మీద ఉన్న సమయంలోనే దర్శించుకోవాలనే భక్తుల ఆశలు అడియాసలయ్యాయి.

పస్రాలో భారీ ట్రాఫిక్‌ జామ్‌..

గోవిందరావుపేట : మండలంలోని పస్రా చౌరస్తా వద్ద శనివారం తెల్లవారుజామున భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మూడు వైపుల నుంచి ఒకే సారి వాహనాలు రావడంతో చౌరస్తా పూర్తిగా స్తంభించింది. ఒకే దారిలో మూడు లైన్లలో వాహనాలు ఒకేసారి రావడం, వన్‌సైడ్‌ ట్రాఫిక్‌ అమలులో తాత్కాలిక గందరగోళం ఏర్పడడంతో సమస్య ఏర్పడింది. దీంతో పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. దీంతో గంటల తరబడి ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు భేష్‌..

కొనియాడుతున్న భక్తులు

మేడారం (ములుగు): ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు భేష్‌ అంటూ భక్తులు కొనియాడుతున్నారు. మహాజాతర కోసం ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుందుకు 6 శాశ్వత, 10 తాత్కాలిక టవర్లు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రైవేట్‌ ఏజెన్సీలు, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా రంగానికి హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ లీజ్డ్‌ లైన్‌ సేవలు అందించింది. నెట్‌వర్క్‌లో ఎలాంటి సమస్య తలెత్తకుండా 10 మంది ఇంజనీర్లను నియమించి మానిటరింగ్‌ చర్యలు చేపట్టింది. ఫలితంగా లక్షలాది మంది భక్తులకు జియో నెట్‌వర్క్‌ సేవలు డౌన్‌ కాగా ఎయిర్‌టెల్‌ అంతంతమాత్రంగానే సేవలందించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ కాల్స్‌, నెట్‌వర్క్‌, వైఫై సేవలకు ఎలాంటి అంతరాయం కలగకపోవడంతో భక్తులు బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు సూపర్‌ అంటూ కితాబిస్తున్నారు.

45 కిలోమీటర్లు.. 12 గంటల ప్రయాణం

మేడారం తిరుగు ప్రయాణంలో

భక్తుల నరకయాతన

గంటల తరబడి వాహనాలు నిలిచిపోయినా అధికారులు కానరాకపోవడంతో భక్తులు ఆగ్రహించారు. ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ కోసం అధికారులు భక్తులకు ముఖం చూపించలేకపోయారు. తల్లులను దర్శనం చేసుకోలేక వెనుదిరిగిన భక్తులు అధికారులపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. దీనికి తోడు దర్శన సమయంలో, క్యూలైన్ల దగ్గర, అధికారుల నిర్వహణ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

అడవిలో అవస్థలు..

వేలాది వాహనాలు కిలో మీటర్ల దూరం స్తంభించి పోయాయి. బస్సులు నిలిచిన ప్రాంతం అడవి కావడంతో ఎక్కడికి వెళ్లాలో, జాతర ఇంకా ఎంత దూ రమొ కూడా తెలియని పరిస్థితుల్లో తల్లుల మీద భారం వేసి కాలినడకన ముందుకు సాగాం. ఎక్కడా ఒక్క పోలీస్‌ వాహనం కనిపించలేదు.

–పద్మ, హనుమకొండ

వర్ణనాతీత బాధలు
1
1/11

వర్ణనాతీత బాధలు

వర్ణనాతీత బాధలు
2
2/11

వర్ణనాతీత బాధలు

వర్ణనాతీత బాధలు
3
3/11

వర్ణనాతీత బాధలు

వర్ణనాతీత బాధలు
4
4/11

వర్ణనాతీత బాధలు

వర్ణనాతీత బాధలు
5
5/11

వర్ణనాతీత బాధలు

వర్ణనాతీత బాధలు
6
6/11

వర్ణనాతీత బాధలు

వర్ణనాతీత బాధలు
7
7/11

వర్ణనాతీత బాధలు

వర్ణనాతీత బాధలు
8
8/11

వర్ణనాతీత బాధలు

వర్ణనాతీత బాధలు
9
9/11

వర్ణనాతీత బాధలు

వర్ణనాతీత బాధలు
10
10/11

వర్ణనాతీత బాధలు

వర్ణనాతీత బాధలు
11
11/11

వర్ణనాతీత బాధలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement