కృషి సఖిలు కీలకపాత్ర పోషించాలి
● జిల్లా వ్యవసాయ అధికారి సరిత
మహబూబాబాద్ రూరల్ : ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించేందుకు కృషి సఖిలు కీలకపాత్ర పోషించాలని జిల్లా వ్యవసాయ అధికారి బి.సరిత అన్నారు. మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలోని జెన్నారెడ్డి వెంకటరెడ్డి ఉద్యాన పరిశోధనా స్థానంలో కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్ శిక్షణ శనివారం ముగిసింది. శిక్షణలో భా గంగా ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత, లాభా లు, పద్ధతులు, సేంద్రియ కర్బన సంరక్షణ, పంటల వైవిధ్యం, జీవ ఉపకరణాల తయారీ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏఓ సరిత మాట్లాడుతూ.. కృషి సఖిలు శిక్షణను వినియోగించుకుని రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ ప్రోత్సహించాలని సూచించారు. ఐదు రోజుల శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫి కెట్లు అందజేశారు. కార్యక్రమంలో జేవీఆర్ హెచ్‌ఆర్‌ఎస్ శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ ప్రశాంత్ కుమార్, కేవీకే శాస్త్రవేత్త సుహాసిని, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ జైపాల్ రెడ్డి, డాక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.


