క్రీడలతో మానసికోల్లాసం
మహబూబాబాద్ రూరల్ : క్రీడలు మానసిక ఉల్లా సంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా మానుకోట బార్ అసోసియేషన్ కార్యాలయంలో క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ కొర్ర మున్న ఆధ్వర్యంలో న్యాయవాదులకు క్యారమ్, చెస్ క్రీడలు శుక్రవారం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ ముఖ్య అతిఽథిగా హాజరై క్రీడలను ప్రారంభించి మాట్లాడారు. సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అర్వపల్లి కృష్ణతేజ్, జిల్లా కోర్టు పీపీ కొంపెల్లి వెంకటయ్య, జీపీ తోర్నాల నగేశ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తుంపిళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.


