ఓటు హక్కు వినియోగించుకోవాలి
మహబూబాబాద్: ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హత ఉన్న వారు తప్పని సరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఎలాంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతీ ఎన్నికలో నిర్భయంగా ఓటు వేయాలన్నారు. సంబంధిత అఽధికారులు ఓటు హక్కుపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మేడారం భక్తులకు ప్రత్యేక రైళ్లు
డోర్నకల్: డోర్నకల్, ఖమ్మం ప్రాంతాల ప్రజలు మేడారం వెళ్లేందుకు రైల్వే అధికారులు ఖమ్మం, కాజీపేట మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. కాజీపేట ఖమ్మం మధ్య 07504 నంబర్‌తో 28, 29, 30, 31వ తేదీల్లో, అలాగే 07503 నంబర్‌తో 29, 30, 31, ఫిబ్రవరి ఒకటో తేదీల్లో 12 కోచ్‌లతో ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. కాజీపేట నుంచి ఖమ్మం వెళ్లే రైలు మధ్యాహ్నం 2.00గంటలకు, మళ్లీ కాజీపేటలో బయలుదేరి సాయంత్రం 5.30గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. ఖమ్మంలో ఉదయం 10.00 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు మధ్యాహ్నం 12.50 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. ప్రతీ స్టేషన్‌లోనూ ప్రత్యేక రైళ్లకు హాల్టు కల్పించారు.
15రోజుల్లో సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో పేరుకుపోయిన సమస్యలను 15రోజుల్లో పరిష్కరించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 11, 24, 26వార్డులను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని వార్డులన్నీ అధ్వానంగా ఉన్నాయని, సరైన సీసీ రోడ్లు, డ్రెయినేజీలు లేక మురుగునీరు రోడ్లపై పారుతుందన్నారు. ప్రజలు సురక్షింతంగా ఉండేవిధంగా జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్‌రావు, ఎమార్పీస్ జాతీయ నాయకులు పీరయ్య, బీజేపీ నాయకులు శ్యామ్‌సుందర్‌శర్మ, గడ్డం అశోక్, రవియాదవ్, సందీప్, ఇందుభారతి తదిత రులు పాల్గొన్నారు.
యాంటీ బయాటిక్స్ అతి వినియోగంతో ముప్పు
మహబూబాబాద్ రూరల్ : యాంటీ బయాటిక్స్ అతి వినియోగంతో పశువులకు ముప్పు వాటిల్లుతుందని పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు ఎం.కిషన్ కుమార్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మల్యాల కేవీకేలో పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం, సద్గురు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ ఆధ్వర్యంలో యాంటీ మైక్రోబియల్ నిరోధకత, పరిష్కారాలు అనే అంశంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.కిషన్ కుమార్ మాట్లాడుతూ.. అధిక పాల దిగుబడులు, మాంసం కోసం పశువులకు విచక్షణారహితంగా యాంటీ బయాటిక్స్ వాడకూడదని సూచించారు. మరో ప్రధాన శాస్త్రవేత్త ఎస్.బిందుమాధురి మాట్లాడుతూ.. పశువుల్లో సూక్ష్మజీవనాశక ఔషధాల నిరోధకత ఒక నిశ్శబ్ద విపత్తుగా మారుతుందని, ఇది కేవలం పశువుల ఆరోగ్యానికేకాదు, మానవ జీవన భద్రతకూ ముప్పు కలిగిస్తుందన్నారు. మల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ దిలీప్, డాక్టర్లు జ్యోతి, శివజ్యోతి, సాయికిరణ్ పాల్గొన్నారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఓటు హక్కు వినియోగించుకోవాలి


