మక్కలపై మక్కువ | - | Sakshi
Sakshi News home page

మక్కలపై మక్కువ

Jan 24 2026 7:54 AM | Updated on Jan 24 2026 7:54 AM

మక్కల

మక్కలపై మక్కువ

మిర్చి పంటకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు

మరిపెడ రూరల్‌: రైతులకు మొక్కజొన్న పంట సిరులు కురిపిస్తోంది. కొంతకాలంగా జిల్లాలో హైబ్రిడ్‌ మొక్క జొన్న సాగు గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మూడేళ్ల నుంచి సాగు విస్తీర్ణం ఎక్కువైంది. కాగా, మిర్చి సాగులో రైతులు కొన్నిసార్లు ఒడిదుడుకులు, మరి కొన్నిసార్లు తీవ్ర నష్టాలు ఎరుర్కొంటున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగుకు మొగ్గుచూపుతున్నారు. మిర్చి పంటతో పోల్చుకుంటే మొక్కజొన్న మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. దీంతో పలు మండలాల్లో మొక్కజొన్న వైపు రైతులు దృష్టి సారించారు. జిల్లాలో 10,10,64 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు.

అధిక దిగుబడులు..

మొక్కజొన్న ఎకరానికి 25నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. విత్తన వ్యాపారులతో పాటు మార్కెట్‌లో క్వింటాకు రూ.2,300 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. మిర్చి పంటసాగు చేస్తే వరుస నష్టాలు వాటిల్లుతుండడంతో రైతులు ఇతర ఆరుతడి పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే మొక్కజొన్న పంటను ఎంచుకుని సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు.

ఎకరానికి రూ.80వేలకు పైగా ఆదాయం..

మొక్కజొన్న ఎకరానికి రూ.70వేల నుంచి రూ.80 వేలకు పైగా ఆదాయం వస్తుండడంతో రైతులు సాగువైపు మక్కువ చూపిస్తున్నారు. కనిష్టంగా రూ.60వేలు, గరిష్టంగా రూ. 80 వేల కు పైగా ఆదాయం వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. మక్క సాగులో నీటి తడులు కొద్దిగా ఎక్కువ అయినప్పటికీ.. పెట్టుబడి తక్కువ కావడంతో రైతులు ఈ పంట సాగు వైపే మొగ్గుచూపుతున్నారు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి అవుతుంది.

పెట్టుబడి తక్కువ.. ఆదాయం కాస్త ఎక్కువే

మూడేళ్ల నుంచి దృష్టి సారిస్తున్న జిల్లా రైతులు

మక్కలపై మక్కువ1
1/2

మక్కలపై మక్కువ

మక్కలపై మక్కువ2
2/2

మక్కలపై మక్కువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement