గద్దెల పునర్నిర్మాణం అద్భుతం
● ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే శ్రీహరి
ములుగు రూరల్/ఎస్‌ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర కొత్త వైభవాన్ని సంతరించుకుందని, గద్దెల పునర్నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. మంగళవారం కుటుంబ సమేతంగా వారు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత వారు ఆదిదేవత గట్టమ్మతల్లిని దర్శించుకుని పుసుపు–కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. అనంతరం వారు మేడారం చేరుకోగా ఆలయ సంప్రదాయం ప్రకారం వారికి అధికారులు, పూజారులు డోలు వాయిద్యాలతో గద్దెలపైకి స్వాగతం పలికారు. పూజల అనంతరం వారికి అమ్మవార్ల వస్త్రాలను బహూకరించి ప్రసాదం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంత గొప్పగా అభివృద్ధి చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్ర ప్రజలు, ఆదివాసీ గిరిజనుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


