అక్రమ కేసులకు భయపడేది లేదు
మహబూబాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీశ్‌రావుకు సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చినా.. సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని, ఆ కేసులకు భయపడేది లేదని మాజీ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సింగరేణిలో జరిగిన అవినీతిపై హరీశ్‌రావు మాట్లాడినందుకే విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి డైవర్ట్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్ పేరుతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను ఇబ్బంది పెడుతున్నారని, వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం సభలో బీఆర్‌ఎస్ పార్టీపై తనకున్న అక్కసును వెళ్లగక్కారని, రాష్ట్రంలో ఎక్కడ బీఆర్‌ఎస్ జెండా గద్దె కూలినా దానికి సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, నాయకులు రంజిత్, రవి, రవిచందర్‌రెడ్డి, కెఎస్‌ఎన్‌రెడ్డి, ఫరీద్, శ్రీనివాస్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, అశోక్, మహబూబ్‌పాషా పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు..
మహబూబాబాద్ రూరల్ : బీఆర్‌ఎస్ పార్టీ, అధినేత కేసీఆర్‌పై ఖమ్మం సభలో సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్ నేతలు ఎస్పీ కార్యాలయంలో అడ్మిన్ డీఎస్పీ మోహన్‌కు మంగళవారం ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలో త్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి, గద్దె రవి, కేఎస్‌ఎన్ రెడ్డి, ముత్యం వెంకన్నగౌడ్, మురళీధర్ రెడ్డి, నాయిని రంజిత్, లూనావత్ అశోక్, పల్లా రామచంద్రారెడ్డి, ఫరీద్ తదితరులు ఉన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావును ఇబ్బంది పెట్టే కుట్ర
మాజీ ఎంపీ మాలోత్ కవిత


