ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌కు వేళాయె
మహబూబాబాద్ అర్బన్: ఇంటర్ దశ విద్యార్థులు చాలా కీలకం. కాగా, ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించడంతో పాటు భయం తొలగించేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులందరికీ ఇంగ్లిష్ సబ్జెక్టులో ప్రాక్టికల్ పరీక్షలను అమలు చేస్తోంది. కాగా, ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్‌టీఎస్) ఎగ్జామ్ తరహాలో ఈ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఇంగ్లిష్ సబ్జెక్టులో 80మార్కుల థియరీ, 20మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయించారు.
పరీక్షలు ఇలా..
జిల్లా వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరంలో 4,146 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,111 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా ఈనెల 21న మొదటి సంవత్సరం విద్యార్థులకు, ఈ నెల 22న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 23న నైతిక, మానవ విలువలు (పాత విద్యార్థులు), ఈ నెల 24న పర్యావరణ విద్య పరీక్షలు రాయాలని ఇంటర్ బోర్డు నిబంధనలు విధించింది. పరీక్షలు రాసిన వారిని పాస్ చేస్తామని, రాయని వారిని ఫెయిల్ చేస్తామని బోర్డు తెలిపింది. పరీక్షలు రాసిన విద్యార్థుల మార్కులను కళాశాల అధ్యాపకులు అదేరోజు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.
పరీక్షలు రాయకుంటే ఫెయిలే..
ఇంటర్ ఫస్ట్‌యర్ విద్యార్థులకు ఇచ్చిన అసైన్‌మెంట్‌కు సంబంధించిన ఎథిక్స్, ఎన్విరాన్‌మెంట్ పరీక్షలకు 100 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలను విద్యార్థులు కళాశాలలోనే రాయాల్సి ఉంటుంది. జవాబు పత్రాలను ఈ నెల 27వ తేదీలోగా కళాశాలల నిర్వాహకులు జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయానికి పంపించాలి. కాగా, ఈ పరీక్షలు రాయని విద్యార్థులు ఫెయిల్ అవుతారు.
అధ్యాపకులదే బాధ్యత
విద్యార్థులు నైతిక, మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు రాసేలా అధ్యాపకులు బాధ్యత తీసుకోవాలి. ఈ నెల 27వ తేదీ వరకు జిల్లా ఇంటర్మీడియట్‌శాఖ కార్యాలయంలో జవాబు పత్రాలను అందజేయాలి. 23న ఉదయం 10:30 గంటలకు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఉంటుంది. అందరూ తప్పనిసరిగా హాజరుకావాలి.
– సీహెచ్. మదార్‌గౌడ్, డీఐఈఓ
జిల్లాలో నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు నిర్వహణ
ఎథిక్స్, ఎన్విరాన్‌మెంట్ పరీక్షలు రాయకుంటే ఫెయిలే..
కళాశాలల వివరాలు
కళాశాల మొత్తం విద్యార్థులు
ప్రభుత్వ కళాశాలలు 1,382
ప్రైవేట్ కళాశాలలు 1,275
ట్రైబల్, సోషల్ వెల్ఫేర్
కళాశాలలు 5,600
ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌కు వేళాయె
ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌కు వేళాయె


