చిట్స్ బాధితులకు చెక్కులు అందజేత
● 37 మందికి రూ. 3 కోట్ల ఎఫ్‌డీ విడుదల
కాజీపేట అర్బన్ : చిట్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదేశాల మేరకు జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం వరంగల్ ఆర్వో కార్యాలయంలో చిట్‌ఫండ్ బాధితులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అక్షర, అచల, భవితశ్రీ, శుభనందిని, కనకదుర్గ చిట్‌ఫండ్ బాధితులకు చిట్ ఫండ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను రిలీజ్ చేసి బాధితులకు అందజేయాలనే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించామన్నారు. ఇందులో ఉమ్మడి వరంగల్ నుంచి ఐదు చిట్స్‌కు చెందిన 206 మంది బాధితులు ఫిర్యాదులు అందజేశారన్నారు. ఇందులో భాగంగా తొలి దశలో కనకదుర్గ చిట్స్‌కు చెందిన 37 మంది బాధితులకు రూ.3 కోట్ల ఎఫ్‌డీ(ఫిక్స్‌డ్ డిపాజిట్)ని రిలీజ్ చేసి ఆ చిట్‌ఫండ్ చైర్మన్ రాగిడి తిరుపతిరెడ్డితో కలిసి చెక్కులు అందజేశామని తెలిపారు. చిట్‌ఫండ్ కంపెనీల నుంచి చెల్లింపులు రాని బాధితులు ఫిర్యాదు చేస్తే వారి సొమ్ము అందజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాగా, గత నెల 29వ తేదీన ‘సాక్షి’లో ‘బాధితులకు భరోసా’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనాన్ని చూసి ఫిర్యాదు చేయగా తమకు చెక్కులు అందజేశారని, ఈ ప్రక్రియలో ‘సాక్షి’ కథనం తోడ్పడిందని బాధితులు చెప్పారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చిట్స్ సిబ్బంది మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
వసూళ్లకు పాల్పడిన జర్నలిస్ట్ అరెస్ట్, రిమాండ్
తొర్రూరు: ఎన్నికల అధికారులుగా పేర్కొంటూ బాధితుడి నుంచి వసూళ్లకు పాల్పడిన ఓ జర్నలిస్ట్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఉపేందర్ మంగళవారం తెలి పారు. ఎస్సై కథనం ప్రకారం.. ములుగుకు చెందిన ఆనంద్ ఈనెల 12వ తేదీన కారులో మద్యం కొనుగోలు చేసి పెద్దవంగర మండలం పోచంపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. అతడిని గమనించి ప్లాన్ ప్రకారం తొర్రూరుకు చెందిన ఓ చానల్ యాంకర్ జా టోత్ ఉపేందర్, ఓ పత్రిక విలేకరి చెడుపాక రాజు.. ఆనంద్‌ను అడ్డగించారు. తాము ఎ న్నికల అధికారులమని చెప్పి బెదిరించారు. అంతటితో ఆగకుండా రూ. లక్ష ఇస్తేనే కా రును వదిలేస్తామన్నారు. దీంతో బాధితుడు ఆనంద్ బంధువులకు ఫోన్ చేసి ఆ మొత్తాన్ని ఇవ్వగా వారు కారును వదిలేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా అదే రోజు ఉపేందర్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రాజును మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. పరారీలో ఉన్న మరో విలేకరిని కూడా అదుపులోకి తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు.
రామప్పలో విదేశీయులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం నార్వే, అమెరికాకు చెందిన కట్రీస్ ఆర్ మదర్వేల్, రాధవన్, భూపేందర్ కత్రీలు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చే శారు. ఆలయ విశిష్టత గు రించి టూరిజం గైడ్ కరుణా నిధి, రామప్ప గైడ్ విజయ్‌కుమార్ వివరించగా, రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు.
చిట్స్ బాధితులకు చెక్కులు అందజేత
చిట్స్ బాధితులకు చెక్కులు అందజేత


