ఉపాధ్యాయుల సర్దుబాటు
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఎన్నికల డ్యూటీలు వేయడంతో పిల్లలకు పాఠాలు చెప్పేవారు అందుబాటులో ఉండడం లేదు. దీంతో పిల్లలు స్వచ్ఛందంగా సెలవులు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈమేరకు మంగళవారం సాక్షి దినపత్రికలో ‘పాఠాలు చెప్పేది ఎవరు?’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై డీఈఓ రాజేశ్వర్ స్పందించారు. జిల్లాలో 676 ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఎన్ని కల డ్యూటీలు పడ్డాయి. వారి స్థానంలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉపాధ్యాయులకు విధులు కేటాయించారన్నారు. వారి స్థానంలో స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఎంఈఓల సహకారంతో ఉపాధ్యాయులను సర్దుబాటు చేశామన్నారు.
గార్లవాసికి ఆహ్వానం
గార్ల: విజయవాడలో ఈనెల 27, 28న నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలకు గార్లకు చెందిన కవి, రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు పంజాల ఐలయ్యకు మంగళవారం ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మాతృభాష ప్రయోజనాలు, ప్రాముఖ్యతను వివరిస్తూ తెలుగు సాహిత్య, సాంస్కృతిక కళాభివృద్ధిని కాంక్షిస్తూ 27, 28వ తేదీల్లో విజయవాడలో మహాసభలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మహాసభల్లో తెలుగు భాషపై కవిత గానం చేయనున్నట్లు ఐలయ్య తెలిపారు.
కార్మిక చట్టాలను
పాటించాలి
బయ్యారం: ఇటుక బట్టీల్లో కార్మిక చట్టాలను కచ్చితంగా పాటించాలని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.రాజ్‌క్రిష్ణ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు మంగళవారం మండలంలోని నామాలపాడు, కొత్తపేటలోని ఇటుకబట్టీలను ఆయన సందర్శించి కార్మికులతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచికూలీలు బట్టీల్లో పనిచేసేందుకు వస్తున్నారని, వారి భద్రత యజమానులదేనన్నారు. బట్టీలో పనిచేస్తున్న కూలీలతో చట్టవిరుద్ధంగా పనులు చేయించొద్దన్నారు.
వైభవంగా మల్లన్న
దృష్టి కుంభం
ఐనవోలు: జాతరకు ముందు ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున దృష్టి కుంభం వైభవంగా జరిగింది. గర్భాలయంలో మల్లికార్జునస్వామి, అమ్మవార్లు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మకు ఈనెల 10 నుంచి 15వరకు సుధావళి వర్ణలేపనం పనులు పూర్తిచేశారు. శైవాగమం ప్రకారం వేద మంత్రాలతో దృష్టి కుంభం ప్రక్రియను అ ర్చకులు, వేద పండితులు వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఆర్జిత సేవలు, దైవదర్శనాల ను పునరుద్ధరించారు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ధనుఃసంక్రమణ పూజలు చేశారు.
దృష్టి కుంభం ఇలా..
గర్భగుడికి ఎదుట ఉన్న మహా మండపంలో ఒక పాత్రలో మూడు క్వింటాళ్ల అన్నాన్ని కుంభాకారంలో రాశిగా పోశారు. చుట్టూ పూలతో అలంకరించి అన్నరాశిపై కుంకుమ పోసి జ్యోతులు వెలిగించి, కూష్మాండ బలి నిర్వహించారు. భక్తుల జయజయ ధ్వానాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రధాన ఆలయ తలుపులూ తెరుస్తూ ఉండగా మూలవరులకు రంగులు అద్దిన వ్యక్తి నేత్రాలపై ఉన్న మైనాన్ని తొలగించారు. స్వామి, అమ్మవార్ల మొదటి దృష్టి నేరుగా మానవాళిపై పడకుండా ముందుగానే కుంభాకృతిలో ఏర్పాటు చేసిన అన్నరాశి, అద్దం, మేకలపై పడే విధంగా కుంభ హారతి ఇచ్చారు.
ముగిసిన ప్రధాన ఘట్టం..
దృష్టి కుంభం నిర్వహిస్తే భక్తుల దృష్టి దోషాలు తొలగుతాయని ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ తెలిపారు. దీంతో జాతర ముందు నిర్వహించే ప్రధాన ఘట్టం ముగిసిందని తెలిపారు. ఆలయ చైర్మన్ ప్రభాకర్‌గౌడ్, ఈఓ సుధాకర్, ముఖ్య అర్చకులు శ్రీనివాస్, మధుకర్, వేద పారాయణదారులు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు భాను ప్ర సాద్, మధు, శ్రీనివాస్, నరేష్ శర్మ, దేవేందర్, పోషయ్య, ధర్మకర్తలు రేణుక,శ్రీనివాస్, మహేందర్, కీమా, ఆనందం పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సర్దుబాటు
ఉపాధ్యాయుల సర్దుబాటు
ఉపాధ్యాయుల సర్దుబాటు


